

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ‘సర్’ ప్రక్రియలో జరిగిన ఓట్ల తొలగింపుల వల్ల అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని టీఎంసీ వాదించింది. స్వల్ప ఓట్ల తేడాతో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని, తొలగించిన ఓట్ల పునరుద్ధరణకు సంబంధించిన వేలాది అప్పీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది.
ఒక నియోజకవర్గంలో కేవలం 862 ఓట్ల తేడాతో ఓటమి పాలవగా, అక్కడ 5,000కుపైగా పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారని టీఎంసీ ఆరోపించింది. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ-బీజేపీ మధ్య ఓట్ల తేడా 32 లక్షలు ఉండగా, ఓట్ల తొలగింపులపై 35 లక్షలకు పైగా అప్పీలు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇటువంటి ప్రాంతాల్లో బాధిత ఓటర్లు లేదా రాజకీయ పార్టీలు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం కేసులను పరిశీలిస్తామని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!