

హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌ను ప్రారంభించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు సమయం, శ్రమ, ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజలను ప్రజా రవాణా వైపు ఆకర్షించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడానికి ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం డైలీ, మంత్లీ పాస్‌లతో పాటు కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కామన్ పాస్‌ను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!