

స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. ఎలాన్ మస్క్ కు చెందిన ఈ సంస్థ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో స్టార్‌లింక్ ఉపగ్రహాలను భారీ సంఖ్యలో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. 1957లో అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు, సంస్థలు కలిపి 15,062 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఒక్క స్పేస్ఎక్స్ మాత్రమే దాదాపు 14,844 ఉపగ్రహాలను ప్రయోగించడం విశేషం. మరో 200 ఉపగ్రహాలను ప్రయోగిస్తే ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక శాటిలైట్లను ప్రయోగించిన సంస్థగా రికార్డు సృష్టించనుంది.
ఇక తన ప్రయోగ సామర్థ్యాలను మరింత పెంచేందుకు స్పేస్ఎక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వ్యవస్థ అయిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ ను అభివృద్ధి చేస్తోంది. అయితే స్టార్‌లింక్ ఉపగ్రహాల పెరుగుతున్న సంఖ్య విశ్వ పరిశోధనలకు ఇబ్బందులు కలిగిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ హోల్‌లు, సుదూర గెలాక్సీలపై పరిశోధనలకు ఆటంకం కలగడంతో పాటు కక్ష్య రద్దీ, అంతరిక్ష శిథిలాల సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇస్రో ఆధ్వర్యంలో ప్రస్తుతం 86 భారతీయ ఉపగ్రహాలు కక్ష్యలో ఉండగా, వాటిలో 27 ఉపగ్రహాలు సేవలందిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!