

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన ఆత్మకథలో భారత పౌరసత్వం స్వీకరించిన సందర్భం, అప్పట్లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితుల గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఇటలీకి చెందిన తన గుర్తింపును వదులుకోవడం అంత సులభంగా అనిపించలేదని ఆమె పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాతే భారత పౌరసత్వం స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 1983లో అధికారికంగా భారత పౌరసత్వాన్ని స్వీకరించినట్లు వెల్లడించారు. భారత్‌కు వచ్చిన తర్వాత తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నానని, కొత్త పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకున్నానని ఆత్మకథలో వివరించారు.
పౌరసత్వ మార్పు ప్రక్రియలో ఎదురైన అనుభవాలను కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు. తన ఇటలీ పౌరసత్వాన్ని వదులుకునేందుకు సంబంధించిన పత్రాలను చదువుతున్నప్పుడు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిపారు. వివాహ సమయంలో తన పేరును మార్చుకున్నప్పుడు ఎదురైన మానసిక ఒత్తిడితో సమానమైన భావన, పౌరసత్వాన్ని వదులుకునే సమయంలోనూ కలిగిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం అధికారిక ప్రక్రియ మాత్రమే కాదని, తన వ్యక్తిగత గుర్తింపు, జీవితంలో చోటుచేసుకున్న మార్పులతో ముడిపడిన భావోద్వేగ అనుభవమని ఆమె తన రచనలో వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!