

హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నట్లు తెలిపారు. సార్వత్రిక ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచానికి సంబంధించిన కీలక అంశాలపై సమ్మిట్‌లో చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది నిర్వహించిన భారత్ సమ్మిట్‌కు సుమారు 100 మంది ప్రతినిధులు హాజరయ్యారని గుర్తుచేశారు.
గత ఏడాది సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారని, ఈ ఏడాది కూడా ఆయన హాజరుకానున్నారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ఈ కార్యక్రమానికి రానున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొననున్న ఈ సదస్సు విజయవంతమవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!