

కోలీవుడ్ నటి ప్రియా భవానీ శంకర్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లు కథనాలు వెలువడగా, ప్రస్తుతం డిమాంటి కాలనీ 3, అహం బ్రహ్మస్మీ, మరకతమణి 2 వంటి ఆసక్తికర ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకవైపు కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ నటి, మరోవైపు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియా భవానీ శంకర్, తన చిరకాల ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ జంట డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఆ ఫొటోల్లో ప్రియా, రాజ్‌వెల్ రాజ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. మెడలో మల్లెపూల దండలు, చెంపలకు గంధం పూసుకుని ఉన్న ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించినవిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, తమ వివాహంపై ఈ జంట అధికారికంగా ఇంకా స్పందించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!