

ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశానికి వచ్చే అంతర్జాతీయ విమానాల భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ సమీక్ష కోసం భద్రతా మండలి అధిపతి షుమెల్ బెన్ ఎజ్రా ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని సూచించారు.
టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో హమామ్ అల్ హమ్మామీ కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు, అధికారుల సమాచారం ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో విదేశీ విమానయాన సంస్థల సిబ్బంది భద్రతా పరిశీలనపై ప్రశ్నలు తలెత్తాయి. ఇజ్రాయెల్ రవాణా శాఖ మంత్రి మిరి రెజెవ్ మాత్రం భద్రతా వైఫల్యం జరిగిందన్న వాదనలను ఖండిస్తూ, విదేశాల నుంచి వచ్చే విమానాల భద్రతను మొసాద్, షిన్ బెట్ వంటి నిఘా సంస్థలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!