

లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్లో సౌదీ రాకుమారుడు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ మృతిచెందిన ఘటనకు సంబంధించి దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 29 ఏళ్ల రాకుమారుడు గతేడాది నవంబర్‌లో లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్లో బస చేశారు. నవంబర్ 25న తన గదిలో స్పృహ లేకుండా కనిపించడంతో హోటల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రాకుమారుడి మృతిపై చేపట్టిన దర్యాప్తులో ఆయన మద్యం, డ్రగ్స్ తీసుకోవడంతో పాటు మద్యం మానేందుకు వైద్యులు సూచించిన ఔషధాలను కూడా ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ పదార్థాలన్నింటి ప్రభావం కలిసి ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యకు దారితీసినట్లు అధికారులు నిర్ధారించారు. రాకుమారుడి మరణాన్ని సౌదీ రాయల్ కోర్టు అధికారికంగా ధ్రువీకరించింది. రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో ఆయన అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించినట్లు వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!