

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ భారత్‌పై మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని షేక్‌పురాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌ను ఉద్దేశిస్తూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత ఉపఖండంలో ముస్లింలు శతాబ్దాల పాటు పాలించారని పేర్కొంటూ ఢిల్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను బతికున్నంత కాలం ‘జిహాద్’ కొనసాగిస్తానని, తనలో శక్తి ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించాడు.
ఇదే కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను తల్హా సయీద్ ప్రశంసించాడు. మునీర్ ఖురాన్‌ను కంఠస్థం చేసిన వ్యక్తి అని, విశ్వాసం, భక్తి, జిహాద్ వంటి భావనలను ముందుకు తెచ్చారని పేర్కొన్నాడు. తల్హా సయీద్‌ను అమెరికా, భారత్ ఉగ్రవాదిగా గుర్తించాయి. అమెరికా 2012లో అతడిని ఉగ్రవాదిగా గుర్తించగా, భారత్ 2022లో UAPA కింద వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరే తోయిబాను ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాద సంస్థగా జాబితా చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!