
సినిమాలు

తన పెద్ద కుమారుడి పేరుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని నటుడు సోహైల్ ఖాన్ తాజాగా వెల్లడించారు. అలయన్స్ రియాలిటీ షోలో నటుడు అలీ గోనితో జరిగిన సరదా సంభాషణలో ఆయన మాట్లాడుతూ, మొదట తన కుమారుడికి 'రామ్ ఖాన్' అనే పేరు పెట్టాలని అనుకున్నానని చెప్పారు. అయితే ప్రసవం అనంతరం జరిగిన ఒక సంఘటన తన నిర్ణయాన్ని పూర్తిగా మార్చేసిందని వివరించారు.
డెలివరీ తర్వాత స్పృహలోకి వచ్చిన సీమా మొదటగా "నిర్వాన్ ఎలా ఉన్నాడు?" అని అడిగిందని సోహైల్ తెలిపారు. ఆ పేరు వినగానే తనకు ఎంతో నచ్చిందని, వెంటనే అదే పేరును తన కుమారుడికి ఖరారు చేశానని చెప్పారు. ఈ సరదా జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకోవడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!