

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫీల్ మై లవ్’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హరి ప్రకాష్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విజయ్ సేతుపతి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై, పుదుచ్చేరి, మూనార్, కొడైకెనాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి సంగీతం అందిస్తుండగా, ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!