

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ విభిన్న గెటప్‌లలో కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడంతో ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా మేకర్స్ ఒక సీక్రెట్ నంబర్‌ను అందించారు. ఆ నంబర్ వెనుక ఉన్న అర్థాన్ని కనిపెట్టాలని సూచించడంతో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ తోడేలు తరహా గెటప్‌లో కనిపించనున్నారనే ప్రచారం నేపథ్యంలో 37 నంబర్‌కు దానితో ఏమైనా సంబంధం ఉందా అనే థియరీ తెరపైకి వచ్చింది. మనిషి తోడేలుగా మారే ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ అనే వాదనతో పాటు, తోడేళ్ల వేగానికి సంబంధించిన మరో అంశాన్ని కూడా అభిమానులు ఈ నంబర్‌తో అనుసంధానిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న ఫ్యాన్ థియరీలు మాత్రమే. 37 నంబర్‌కు అసలు అర్థం ఏమిటో మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తేనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!