

చిన్నారుల పాస్‌పోర్ట్ చెల్లుబాటుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ కీలక మార్పు చేసింది. 15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఇకపై జారీ తేదీ నుంచి ఐదేళ్లపాటు లేదా సదరు చిన్నారి 18 ఏళ్లు నిండే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటివరకు మాత్రమే పాస్‌పోర్ట్ చెల్లుబాటులో ఉంటుంది. పాస్‌పోర్ట్స్ (అమెండ్‌మెంట్) రూల్స్-2026 ద్వారా ఈ మార్పు చేశారు.
పాస్‌పోర్ట్స్ యాక్ట్-1967 కింద చేసిన ఈ సవరణతో పాస్‌పోర్ట్స్ రూల్స్-1980లోని రూల్ 12లో మార్పులు చేశారు. సెప్టెంబర్ 15న జారీ చేసిన నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పిల్లల వయసును బట్టి పాస్‌పోర్ట్ వాస్తవ చెల్లుబాటు వ్యవధి మారనుంది. అలాగే పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులకు సంబంధించిన రూల్ 8లోనూ మార్పులు చేసి, వివిధ కేటగిరీలకు వర్తించే ఫీజులను షెడ్యూల్-4లో పేర్కొన్న రేట్ల ప్రకారం వసూలు చేయాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!