8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

Writer: Chandrika 05:29 AM, 8 ఆగస్టు, 2026
లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

రుణ వసూళ్ల పేరుతో రికవరీ ఏజెంట్లు చేసే వేధింపులు, బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం రుణ వసూళ్ల కోసం ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. బెదిరింపులు, అసభ్య పదజాలం, అనామక కాల్స్‌, బహిరంగంగా అవమానించడం, కుటుంబ సభ్యులను భయపెట్టడం వంటి చర్యలను అనుమతించరు. రుణ వసూళ్ల సమయంలో రుణగ్రహీతల గౌరవం, గోప్యతను కాపాడాల్సిన బాధ్యత రుణ సంస్థలపై ఉంటుంది.

ఇంటి వద్దకు రికవరీ ఏజెంట్లను పంపించే ముందు రుణగ్రహీతకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏజెంట్లు తమ గుర్తింపు, అధీకృత పత్రాలను చూపించాలి. రుణగ్రహీతల ఫొటోలు, వీడియోలు, ఆడియోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం చేయడం కూడా నిషేధం. రుణ వసూళ్లను ఔట్‌సోర్స్‌ చేసినప్పటికీ, ఏజెంట్ల చర్యలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాలి. అలాగే ఈఎంఐపై కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను బాకీ చెల్లించని సందర్భాల్లో రిమోట్‌గా పరిమితం చేయడానికీ ఆర్‌బీఐ ప్రత్యేక షరతులు విధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్

ట్యాగ్లు
ఆర్‌బీఐరుణ వసూళ్లుడిజిటల్ లెండింగ్రికవరీ ఏజెంట్లులోన్ వేధింపులురుణగ్రహీతల హక్కులుబ్యాంకింగ్ నిబంధనలుఎన్‌బీఎఫ్‌సీవ్యక్తిగత రుణాలుఆర్థిక నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..
జనరల్

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..
జనరల్

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
జనరల్

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..
జనరల్

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!
రాజకీయాలు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్
జనరల్

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్

విజయ్ బాక్సాఫీస్ పవర్ మరోసారి రుజువు!
సినిమాలు

విజయ్ బాక్సాఫీస్ పవర్ మరోసారి రుజువు!

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!
జనరల్

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!
జనరల్

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?
బిజినెస్

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం
జనరల్

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!