

ఆర్థిక ఉత్పత్తులు, సేవల విక్రయంలో తప్పుడు సమాచారం ద్వారా వినియోగదారులను మోసగించే (మిస్‌సెల్లింగ్) విధానాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠిన నిబంధనలు జారీ చేసింది. వినియోగదారులను బలవంతంగా లేదా తప్పుదోవ పట్టించి ఉత్పత్తులు కొనుగోలు చేయించకుండా రక్షించడమే ఈ నిర్ణయ లక్ష్యం.
“రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ద్వారా ఆర్థిక ఉత్పత్తులు, సేవల ప్రకటన, మార్కెటింగ్, విక్రయం” పేరుతో తీసుకొచ్చిన సవరించిన మార్గదర్శకాల్లో, ఉద్యోగులపై దూకుడుగా అమ్మకాల లక్ష్యాలు పెట్టడం లేదా ఇన్సెంటివ్‌ల ద్వారా ఒత్తిడి చేయడాన్ని బ్యాంకులు చేయకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.
బీమా, మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి ఉద్యోగులకు నేరుగా ఇన్సెంటివ్‌లు ఇవ్వడాన్ని కూడా ఆర్‌బీఐ నిషేధించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్లను కూడా కొత్త నిర్వచనంలోకి తీసుకువచ్చింది. ఇకపై వారి తప్పుడు ప్రచారాలకు సంబంధిత బ్యాంకులదే పూర్తి బాధ్యత అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!