
సినిమాలు

జన్వాడలోని కోడి చెరువు భూముల వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2014లో ఆ భూమిని కొనుగోలు చేశారని, అందులో దాదాపు 6 నుంచి 7 ఎకరాల భూమి కోడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని తెలిపారు. మిగిలిన 3 నుంచి 4 ఎకరాల భూమి మాత్రమే ఎఫ్‌టీఎల్ పరిధికి వెలుపల ఉందని పేర్కొన్నారు.
చెరువు పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని రంగనాథ్ అన్నారు. చెరువులో ఫెన్సింగ్ వేయడం తప్పేనని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, ప్రజా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!