
జనరల్

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సర్వం సిద్ధమైంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు. వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు.
సదస్సు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 35కి పైగా ప్రధాన రహదారులతో పాటు 22 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!