
జనరల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మహిపాల్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా పోస్టును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించారని వారు ఆరోపించారు.
అది నకిలీ ఖాతా నుంచి వచ్చిన పోస్టు అని, బీఆర్‌ఎస్‌లో అసలు అంతర్జాతీయ కార్యదర్శి అనే పదవే లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నకిలీ ఖాతాలోని పోస్టును సభలో ప్రస్తావించడం ద్వారా సభను తప్పుదోవ పట్టించారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ రూల్ 168 కింద రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!