
జనరల్

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు ₹3 పెంచిన కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. “మోదీ ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలే ధర చెల్లిస్తున్నారు. ₹3 షాక్ ఇప్పటికే వచ్చింది.. మిగతా వసూళ్లు విడతలవారీగా చేస్తారు” అంటూ ఆయన ఎక్స్‌లో స్పందించారు. ఇంధన ధరల పెంపు సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతోందని ఆరోపించారు.
2022 తర్వాత దేశవ్యాప్తంగా ఇదే తొలి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు దీనికి కారణమని కేంద్రం, ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల తర్వాత ప్రజలపై భారాన్ని మోపుతున్నారని విమర్శిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!