

పీవీఎన్ మాధవ్ రాష్ట్రంలో భూగర్భ జలాలు, వాన నీటి సంరక్షణ, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు. వాతావరణ మార్పులతో వర్షపాతం అనిశ్చితి, భూగర్భ జలాల అధిక వినియోగం, ఎండిపోతున్న బోర్లు భవిష్యత్తులో నీటి సంక్షోభానికి సంకేతాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనతా వారధి ద్వారా వచ్చిన వినతులను సేకరించి అన్ని జిల్లాల కలెక్టర్లకు భాజపా శ్రేణులు వినతిపత్రాలు అందించాయని తెలిపారు.
జల వనరుల సక్రమ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని, భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లు, చిన్న చెరువుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మార్గదర్శకాలు, నిధులు, జియో ట్యాగింగ్ వంటి సహాయం అందిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో వాటి అమలులో కొందరు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!