
రాజకీయాలు

పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పక్కా పథకం ప్రకారం హత్య చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు. జూన్ 4న మొదటి ప్రయత్నం విఫలమైన తర్వాత జూన్ 18న ప్లాన్‌ను అమలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
దర్యాప్తు ప్రకారం నిందితులు మొబైల్ డేటా, జీపీఎస్ ఆఫ్ చేసి గంటల తరబడి ట్రాకింగ్‌కు దొరకకుండా వ్యవహరించారు. బాధితుడిని కోట సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లి, సంకేతం ఇచ్చిన తర్వాత 400 అడుగుల లోతులోకి తోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ ఆధారాల ఆధారంగా పోలీసులు కేసును రీ-క్రియేట్ చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!