

కర్ణాటక విద్యావర్థక సంఘం 50వ వార్షికోత్సవాల ముగింపు సదస్సుకు హాజరైన బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా కొన్ని సంఘాలు నిరసనకు దిగాయి. భాజపాకు చెందిన సవితా అమరశెట్టి, రాహుల్ మల్లిగవాడ నేతృత్వంలోని ప్రతినిధులు ‘గో బ్యాక్ ప్రకాశ్‌రాజ్’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా వచ్చినవారు ‘ప్రకాశ్‌రాజ్‌కు స్వాగతం’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకుని ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులను వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. విద్యావర్థక సంఘం ముందు ఏర్పాటు చేసిన ప్రకాశ్‌రాజ్ బ్యానర్‌కు కొందరు మసి పూసి, అనంతరం చించి వేసినట్లు సమాచారం. కార్యక్రమం ముగిసిన తర్వాత పోలీసులు ప్రకాశ్‌రాజ్‌కు భద్రత కల్పిస్తూ అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కార్యక్రమం పరిసరాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!