

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్’ సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో రజినీకాంత్ డెడ్లి డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని కూడా నటిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఇందులో ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రామ్ పోతినేని ఇప్పటికే ‘ధర్మన్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. దీంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రస్తుతం రామ్ పోతినేని తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు ‘ధర్మన్’ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాల చిత్రీకరణకు ఆయన ఎలాంటి గ్యాప్ లేకుండా డేట్స్ కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ‘ధర్మన్’లో రామ్ పోతినేని పాత్ర సాధారణ అతిథి పాత్ర కాదని, కథలో కీలకమైన స్థాయిలో ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రజినీకాంత్‌తో ఆయనకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రామ్ పాత్ర, లుక్, విలన్ పాత్ర అనే వార్తలపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!