
జనరల్

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌కు చేరుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో బిష్కెక్‌లోని పరిసరాలు మార్మోగాయి. మోదీ రాక సందర్భంగా భారతీయ సమాజంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా వివిధ దేశాల నేతలతో కీలక అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!