

గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 99 ప్యాకేజీ కాలువ నుంచి నీరు లీకేజీ కావడంతో మిరపతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గువ్వల రంగన్న, ఆర్. డోలు రాముడు తదితర రైతులకు చెందిన పంటలు నీటి లీకేజీ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామని, పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరగడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
కాలువ నిర్మాణ పనులు పూర్తిగా ముగియకముందే నీటిని విడుదల చేయడం, లీకేజీలను ముందుగా పరిశీలించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువ పరిస్థితిని, దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని కోరుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో పాటు బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కాలువ పనులను నాణ్యతతో పూర్తి చేసి, భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!