
జనరల్

నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 790కి చేరినట్లు సమాచారం. మరోవైపు 2,500 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయి.
నేపాల్‌లో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత్ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రత్యేక సహాయక బృందాలను అక్కడికి పంపించి, స్థానిక అధికారులతో కలిసి రెస్క్యూ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!