

హోర్ముజ్ జలసంధిలోని లారక్ ఐలాండ్‌లో ఇరాన్‌కు చెందిన రెండు లాంచర్లపై అమెరికా సైన్యం సోమవారం తెల్లవారుజామున దాడులు చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అమెరికా ఉన్నతాధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలిపింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) దళాలు హోర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా సైన్యం ఈ దాడులు చేసినట్లు ఆ అధికారి వెల్లడించారు. అయితే దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశంపై వెంటనే స్పష్టత రాలేదు.
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ఈ ప్రాంతంలో చోటుచేసుకునే ఏ సైనిక చర్య అయినా అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా దాడుల వార్త వెలువడింది. హోర్ముజ్ జలసంధిలో భద్రత, సముద్ర రవాణాపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!