

తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన ‘డిసి’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 7న తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని గతంలో ప్రచారం జరగగా, సన్ నెక్స్ట్ ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించింది.
అయితే తాజాగా ‘డిసి’ ఓటీటీ విడుదల విషయంలో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రైమ్ వీడియోతో కుదిరిన డీల్ రద్దయినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది. అయితే ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు వెర్షన్లు కాకుండా హిందీ వెర్షన్ అందుబాటులోకి వస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!