

ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి ఈ మైలురాయి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా చేస్తున్నాయని ఆమె తెలిపారు.
పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ వంటి ఆదివాసీ సంక్షేమ పథకాలు తనకు ప్రత్యేకమైనవని రాష్ట్రపతి పేర్కొన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలతో ప్రధాని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా మోదీ వరుసగా అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన రికార్డును సొంతం చేసుకున్నారు. 4,399 రోజుల పదవీకాలంతో జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!