
సినిమాలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి వెళ్లనున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
అంతకుముందు ఉదయం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యంపై పార్టీ నాయకత్వం నిరంతరం ఆరా తీస్తుండగా, ఆయన త్వరగా కోలుకోవాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!