
సినిమాలు

ప్రశ్నపత్రాల లీకేజీలు, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టింది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, జులై 20న 'సంసద్ ఛలో' కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల బలప్రయోగంపై కేంద్రం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించారంటూ ఆరోపిస్తూ వెంటనే చర్చ జరపాలని పట్టుబట్టాయి. సభలో గందరగోళం కొనసాగడంతో ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!