
జనరల్

పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడంపై తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏకనాపురం గ్రామస్థులు గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సమాచారం. విమానాశ్రయ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామస్థులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
అదే గ్రామసభలో ఏకనాపురంలోని ఓ రహదారికి ‘తలపతి విజయ్ రోడ్’ అని పేరు పెట్టేందుకు కూడా ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. పరందూర్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఏకనాపురం, పరిసర గ్రామాల ప్రజలు కొనసాగిస్తున్న నిరసనల మధ్య ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!