
టెక్నాలజీ

రైడ్ యాప్‌లలో ప్రయాణానికి ముందే టిప్ ఇవ్వాలని ప్రయాణికులను ప్రోత్సహించకూడదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ మోటార్ వెహికల్ అగ్రిగేటర్లకు సూచించింది. రైడ్ త్వరగా దొరుకుతుందనే ఆశతో ప్రయాణికులు అదనంగా చెల్లించేలా యాప్‌లలో ముందస్తు టిప్పింగ్ ఆప్షన్లను ప్రోత్సహించకూడదని స్పష్టం చేసింది.
బుకింగ్ ప్రక్రియలో ‘ముందస్తు టిప్ ఇవ్వండి’, ‘యాడ్-ఆన్‌ను ఎంచుకోండి’, ‘మీ రైడ్ త్వరగా ఖరారయ్యే అవకాశాలను మెరుగుపరచుకోండి’ వంటి సందేశాలను కొన్ని రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు చూపిస్తున్నాయన్న నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ సూచనలు చేసింది. ప్రయాణికులు అదనపు చెల్లింపులు చేయాల్సిన ఒత్తిడి లేకుండా రైడ్ బుకింగ్ ప్రక్రియను నిర్వహించడమే ఈ చర్య ఉద్దేశంగా కనిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!