
క్రీడలు

గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు కోయంబత్తూరు పోలీసులు సుమారు 40 కిలోమీటర్లు ఛేజ్ చేశారు. నిందితులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు పోలీసులను తోసేసి కారులో పరారైనట్లు సమాచారం. ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ వేల్మురుగన్ కారుపైకి దూకి, వాహనం కదులుతున్నప్పటికీ దానిపై వేలాడుతూ ప్రయాణించినట్లు తెలుస్తోంది.
సుమారు 40 కిలోమీటర్ల పాటు ఛేజ్ కొనసాగిన అనంతరం తిరుప్పూర్ సమీపంలో పోలీసులు స్మగ్లర్ల కారును అడ్డుకున్నారు. వాహనాన్ని చుట్టుముట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నడుస్తున్న కారుపై హెడ్‌కానిస్టేబుల్ వేల్మురుగన్ వేలాడుతూ వెళ్లిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!