

UIDAI ఐదేళ్ల నుంచి 17 ఏళ్లలోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్‌కు ప్రస్తుతం ఫీజు మినహాయింపు కల్పించింది. ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేసే బాల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ వివరాలు తీసుకోరు. ఐదేళ్లు నిండిన తర్వాత ఫొటోతో పాటు వేలిముద్రలు, ఐరిస్ వివరాలను అప్‌డేట్ చేయాలి. 15 ఏళ్ల వయసులో మరోసారి బయోమెట్రిక్ వివరాలను నవీకరించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఉచిత సదుపాయం 2026 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంది.
తల్లిదండ్రులు సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, రెండు కోట్లకు పైగా పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేసినట్లు సమాచారం. గడువు తర్వాత వర్తించే ఫీజు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉన్నందున, గడువులోగా అప్‌డేట్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!