
జనరల్

విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించనున్న శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించిన ఆయన, ఈ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు బెంగళూరుకు వెళ్తున్నానని తెలిపారు. ఈరోజు ఫ్రీడమ్ పార్క్‌లో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది.
ప్రవేశ పరీక్షల వివాదాలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావాలనే డిమాండ్లతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా విద్యార్థుల ఉద్యమాలకు మద్దతు తెలిపిన ప్రకాశ్ రాజ్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ స్వరం వినిపించాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!