

పశ్చిమబెంగాల్‌కు చెందిన BJP ఎమ్మెల్యే రేఖా పాత్రా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. తొలుత ఆహారం కలుషితం కావడం వల్లే ఆమె అస్వస్థతకు గురై ఉంటారని భావించినప్పటికీ.. వైద్య పరీక్షల్లో రక్త నమూనాల్లో పురుగుల మందు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అస్వస్థతకు గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శనివారం మధ్యాహ్నం రేఖా పాత్రా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు తొలుత ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అనంతరం మెరుగైన చికిత్స కోసం బసిర్హత్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె శరీరంలోకి పురుగుల మందు ఎలా చేరిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషప్రయోగం జరిగిందా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు, పశ్చిమబెంగాల్ ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కలుషిత ఆహారం కారణమై ఉండొచ్చని, అస్వస్థతకు గల కారణాలను గుర్తిస్తామని తెలిపారు. సందేశ్‌ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా రేఖా పాత్రా గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బసిర్హత్ నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆమె.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్‌గంజ్ నుంచి విజయం సాధించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!