

రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 20న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐజీ వర్గానికి లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1,000 ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇప్పటికే లక్ష ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతాల్లో స్థలాలు గుర్తించినట్లు, నిర్మాణ నమూనాలు, అంతస్తులు, ఫ్లాట్ పరిమాణంపై సీఎంతో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా నగరానికి సమీపంలో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. లబ్ధిదారులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకోవడం సంతోషకరమని పేర్కొంటూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!