

హైటెక్ హంగులతో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఒకేసారి జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను దక్షిణ మధ్య రైల్వే ఆహ్వానించింది.
రూ.26 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్ ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండి రోజూ వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. రోజుకు 62 ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయి. రెండు కొత్త లిఫ్టులు, విస్తరించిన ప్రవేశ ద్వారం, 12 మీటర్ల ఓవర్ బ్రిడ్జి, విశాలమైన వేచి గది, ఆధునిక మరుగుదొడ్లు, కొత్త భవనం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!