
సినిమాలు

హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగూడెం జిల్లా రేగళ్ల గ్రామంలో ఆదివారం జరిగిన పర్యటన సందర్భంగా కొత్తగూడెంకు చెందిన జర్నలిస్టులు మంత్రిని కలిసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
రామవరం-ముర్రేడు బ్రిడ్జి సమీపంలో గతంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 10 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, కొన్ని కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని జర్నలిస్టులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన పొంగులేటి హైదరాబాద్‌తో పాటు స్థానిక జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!