
క్రీడలు

నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రోడ్డు మార్గంలో హెచ్ఐసీసీకి ప్రధాని బయల్దేరారు.
ఈ పర్యటనలో భాగంగా రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!