

విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ మరోసారి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. క్షణం, గూఢచారి, మేజర్, హిట్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన.. తాజాగా వరదలతో ఇబ్బందులు పడుతున్న మూగజీవాల కోసం ముందడుగు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జంతువులను రక్షించేందుకు స్థానిక జంతు సంరక్షణ సంస్థలు, రక్షణ బృందాలతో కలిసి ఆయన బృందం పనిచేయనుంది. అసోం, కేరళ, గుజరాత్, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణెతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వరదల్లో చిక్కుకున్న, గాయపడిన జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వాటికి ఆహారం, తాగునీరు, ఆశ్రయం, వైద్య సహాయం అందించనున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అడివి శేష్ చివరిగా డకాయిట్‌లో కనిపించారు. ప్రస్తుతం వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో గూఢచారి 2 చేస్తున్నారు. ఈ గూఢచారి 2పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!