
జనరల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో డీమార్ట్ తరహాలో ‘మీ మార్ట్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1000 మీ మార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 970 దుకాణాలు సిద్ధమయ్యాయని, మిగిలిన 130 దుకాణాలను కూడా త్వరగా పూర్తి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
డీమార్ట్‌కు పోటీగా అదే తరహా కాన్సెప్ట్‌తో ‘మీ మార్ట్లు’ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తొలుత ఈ మార్ట్లలో 64 రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఈ మార్ట్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు సరుకులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!