
బిజినెస్

భాగ్యనగర్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ రావినూతల శశిధర్ గణపతి నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. బాలాపూర్ గణేశుడితో పాటు నగరంలోని అన్ని గణేష్ విగ్రహాలు సాగర్ వైపు తరలనున్న నేపథ్యంలో భక్తులు, నిర్వాహకులు సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.
నిమజ్జన శోభాయాత్రలో అశ్లీలతను ప్రేరేపించే పాటలకు బదులుగా ఆధ్యాత్మిక, భక్తి గీతాలను వినిపించాలని శశిధర్ విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో పోలీసులకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గణేష్ ఉత్సవాలను విస్తృతంగా కవర్ చేస్తున్న మీడియా సంస్థలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!