
రాజకీయాలు

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించిన ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన తల్లి పేరిట మొక్క నాటినట్లు పేర్కొన్న పీయూష్ గోయల్, దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారి తమ తల్లి పేరిట ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని సూచించారు. అలాగే తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణ, త్వరిత దర్శనం కోసం అమలు చేస్తున్న AI కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరును ప్రశంసించారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!