

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్ర ఎండలు, తుఫానులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏయూ క్యాంపస్‌లో మొక్క నాటిన సీఎం, ప్రస్తుతం 25 శాతంగా ఉన్న గ్రీనరీని 50 శాతానికి పెంచాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్, వ్యర్థాల నిర్వహణ, కంపోస్టింగ్, బయోడైవర్సిటీ పార్కులు, నీటి పునర్వినియోగం వంటి చర్యలతో ఆంధ్ర యూనివర్శిటీని నెట్ జీరో క్యాంపస్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!