

పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్లు పరిసర ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల్లో కాలుష్య కారకాలు అనుమతించిన పరిమితుల కంటే అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. దీనిపై జిల్లా అధికారులు, పీసీబీ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
గోదావరి నది ఇంత తీవ్రంగా కలుషితమవుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మురుగునీటి శుద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, శుద్ధి చేయని నీరు గోదావరిలో కలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే గోదావరి ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!