

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఘర్షణలకు తాత్కాలిక విరామం లభించింది. అయితే వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ జలమార్గంలో ఓ చమురు ట్యాంకర్ సీమైన్‌ను ఢీకొన్నట్లు వార్తలు రావడంతో వాణిజ్య నౌకల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో వాణిజ్య నౌకలకు ముప్పు అధికంగానే ఉందని తాజా మారిటైమ్ హెచ్చరికలు సూచిస్తున్నాయి.
మరోవైపు హర్మూజ్ జలసంధిలో భవిష్యత్ నౌకా రవాణా నిర్వహణపై ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. నౌకల భద్రత, ఇరు దేశాల సార్వభౌమ హక్కులు, వాణిజ్య రవాణాకు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. హర్మూజ్ మీదుగా ప్రయాణించే నౌకలకు రుసుములు విధించే విధానంపైనా చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన ఈ జలమార్గంలో వాణిజ్య రాకపోకలకు అంతరాయం కలగకుండా భద్రత, సార్వభౌమాధికార అంశాలపై పరిష్కారం కనుగొనడం ఈ చర్చల్లో ప్రధానాంశంగా ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!