
క్రీడలు

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో జరిగిన ఘోర బాంబు పేలుడు కలకలం రేపింది. లక్కీ మార్వాత్ ప్రాంతంలో ఉగ్రవాదులు రిక్షాలో అమర్చిన బాంబు పేలడంతో కనీసం తొమ్మిది మంది మృతిచెందగా, ఇరవై మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక మహిళ ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు. అయితే ఈ ఘటన వెనుక తెహ్రిక్- ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న హింసకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!