

‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకు నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఆయన సీజన్ 10పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వెరైటీ, సర్‌ప్రైజ్‌లు, డ్రామా, ఛాలెంజ్‌లు గత సీజన్లతో పోలిస్తే పదింతలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
“మీరు ఎంతైనా ఆశించండి. ‘బిగ్‌బాస్ సీజన్ 10’ నెక్స్ట్ లెవల్‌గా ఉంటుంది. వారం వారం సరికొత్త అవతారం కనిపిస్తుంది. ఇది ‘దశావతారం’” అంటూ నాగార్జున ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. “ఆటలో సవాల్ కాదు. ఆటే సవాల్” అంటూ ఈ సీజన్‌లో ఉండబోయే ప్రత్యేకతలను వెల్లడించారు.
ప్రస్తుతం సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కొందరు నటీనటులను నేరుగా ఎంపిక చేస్తుండగా, సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ‘అగ్ని పరీక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నవదీప్, బిందు మాధవి, అభిజీత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఫైనలిస్టులను ఖరారు చేయనుండగా, ‘బిగ్‌బాస్ 10’ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!